సందేహాలు - సమాధానాలు
*ఒక మిత్రుడు గత జూన్ మాసంలో రిటైర్మెంట్ అయ్యారు... పెన్షన్ ప్రపోజల్ పంపు సందర్భంగా పెన్షన్ కమ్యుటేషన్ చేసుకున్నాడు.
*ప్రస్తుతం పెన్షన్ మంజూరు పేపర్స్ కూడా వచ్చాయి... జూలై మాసం పెన్షన్ కూడా జమ అయింది.
*కమ్యుటేషన్ రద్దు చేసుకొని పూర్తిగా పెన్షన్ తీసుకోవాలంటున్నాడు.
*ఇప్పుడు కమ్యుటేషన్ ప్రపోజల్ రద్దు చేసుకోవాలని భావిస్తున్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్యుటేషన్ అమౌంట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు...
*అందుకని కమ్యుటేషన్ ప్రపోజల్ ప్రస్తుతం తిరిగి రద్దు చేసుకునే అవకాశం ఉంటుందా?
*ఒకవేళ రద్దు చేసుకునే అవకాశం ఉంటే అది ఏ విధంగా రద్దు చేసుకోవచ్చు ... అట్టి విధి విధానాలు తెలుపగలరు.
*ఎన్ని రోజుల లోపు రద్దు చేసుకోవచ్చు.... కాల పరిమితి నిబంధన ఏమైనా ఉందా?
*సమాధానము:
* *కమ్యుటేషన్ వద్దనుకుంటే నిరభ్యంతరంగా రద్దు చేసుకోవచ్చు. ఒక దరఖాస్తు చేసుకోండి. కమ్యుటేషన్ బిల్ చేయవద్దని చెప్పండి. ఆ మేరకు వారు ఎజికి ప్రతిపాదనలు పంపి రద్దు చేస్తారు. ఎలాగూ ఇంకా కమ్యుటేషన్ తీసుకోలేదు కావున ఫుల్ పెన్షన్ ఇస్తారు.
* *కమ్యుటేషన్ అనేది ఇప్పటికీ ఒక సదవకాషమే. కమ్యుటేషన్ చెల్లించిన తదుపరి నెల నుండి మాత్రమే పెన్షన్ లో కోత విధించి మినహాయింపులు చేస్తారు. ఎప్పుడు మీకు చెల్లింపులు చేస్తే అప్పటినుంచి మాత్రమే అంటే తరువాతి నెలనుండి మినహాయింపులు మొదలౌతాయి. కాబట్టి ఎప్పుడు వచ్చినా మంచిదే. అయితే వచ్చే ఆ పది లక్షలతోటి ఏం చేయాలనుకుంటామో అది మాత్రం ఇప్పుడు సాధ్యం కావడం లేదు. మనకు డబ్బు చేతికి వచ్చిన తరువాతనే పని మొదలు పెడదామనుకుంటే అప్పుడు దానికి సరియైన సమయం కాకపోవచ్చు.
* *రెండవ విషయం మీరు కమ్యుటేషన్ తీసుకుంటే మీకు ఇచ్చిన దానిమీద 8.5% దాకా వడ్డీతో మీ దగ్గర వసూలు చేస్తారు. అంటే అప్పు తీసుకున్నట్లు. అప్పుచేయదలచు కోనట్లు అయితే తీసుకోకపోవడం మంచిది. అలా చేస్తే ఇక్కడ ఒక అవకాషం పోతుంది. కమ్యుటేషన్ చేసి ఆ మొత్తం పొంది ఒక వేళ మరణిస్తే ఆ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగాలేదు. ఇంకా పదిహేను సంవత్సరాలు బతకను. ఇంకో నాలుగైదేండ్లకు మించి బతకను అనుకుంటే తప్పక కమ్యుటేషన్ తీసుకోవాలి. లేదు మన ఆరోగ్యం బాగా ఉంది. ఇప్పటికీ బిపి, షుగర్ లాంటివి లేవు, ఇంకో ఇరవై ఏండ్లయినా బాగానే బతకగలను అనుకుంటే ప్రభుత్వం మీకు ఇస్తున్న దానికంటే మీ దగ్గర ప్రభుత్వం వసూలు చేసేది కాస్త ఎక్కువే అవుతుంది. నాకు తెలిసిన వారు ఉన్నారు. రిటైర్ అయి కమ్యుటేషన్ తీసుకున్నారు. ఆ డబ్బును బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. అది పెద్ద తప్పు. ఫైనాన్షియల్ లిటరసీ మనకు చాలా, చాలా తక్కువ. అలాంటి వారు ఇలాంటి తప్పులు చేస్తారు. మనకు ఫైనాన్సియల్ లిటరసీ బాగా తెలుసు అనుకుంటాము. అది పెద్ద తప్పు.
* *మూడవ విషయం. మీరు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వారైతే కమ్యుటేషన్ తీసుకోవడము మంచిది. ఎందుకంటే మీరు తీసుకున్న దానికి మీరు వడ్డీ దాదపు 8.5% అయితే ఆ డబ్బును ఏదైనా మంతి మ్యూచువల్ ఫండ్ లో పెట్టినట్లయితే మీకు మినిమం 11% వడ్డీ వస్తుంది. అంటే మీకు అది చాలా ప్రయోజనకరం.
* *టోటల్ గా మన పరిస్థితిని అనుసరించి కమ్యుటేషన్ తీసుకోవాలా, వద్దా అని నిర్ణయించుకోవాలి.