సందేహాలు - సమాధానాలు
*సస్పెండ్ / షోకాజ్ / ఛార్జ్ మెమో కి తేడా ఏంటి?
సమాధానము:
*సస్పెండ్ చేస్తే చాలా వరకు విచారణ అధికారిని నియమిస్తారు. వారు విచారించి నివేదిక ఇస్తారు.*
*Showcause కు మీరు తగు ఆధారాలతో వివరణ ఇవ్వాలి. ఛార్జిమెమో కు వారు తెలిపిన చార్జెస్ కు సమాధానం ఇస్తూ మీ వైపు ఉన్న ఆధారాలు తెలపాలి.
ప్రశ్న-2:
*ఒక ప్రభుత్వ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో ఉన్నచో అతనికి ప్రొబెషన్ డిక్లరేషన్ చేయవచ్చునా?
సమాధానము:
*ఒక ప్రభుత్వ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో ఉన్నచో అతనికి ప్రొబేషన్ డిక్లరేషన్ చేయరాదు. స్టేట్ అండ్ సబర్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 లోని రూలు 17 మరియు 18 లను చూడగలరు.*
ప్రశ్న-3:
*డిస్మిస్ లేదా రిమూవల్ అయిన ఉద్యోగి తిరిగి ఉద్యోగంలో చేరినచో అతని పాత లీవ్ ఎకౌంటు కంటిన్యూ చేయవచ్చునా? తెలపగలరు?
సమాధానము:
*డిస్మిసల్ లేదా రిమూవల్ అయిన ఉద్యోగి తిరిగి ఉద్యోగంలో చేరినచో అతని ముందు సర్వీసుకు సంబంధించిన లీవ్ ఖాతా లెక్కలోనికి తీసుకొనవలెను.
ప్రశ్న-4:
*ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక డిసిప్లినరీ కేసులో సస్పెండ్ చేయబడినాడు (అనగా క్రమశిక్షణాత్మక చర్యల వలన) అతనిపై ఆ కేసు పెండింగ్లో ఉన్నది. అతను రెండు సంవత్సరాల తర్వాత సస్పెన్షన్ నుండి తిరిగి ఉద్యోగంలోనికి చేర్చుకోవడం అయినది. ఈ సందర్భంలో అతనికి జీతభత్యాలు చెల్లించుచున్నారు. అతనికి వార్షిక ఇంక్రిమెంట్స్ మంజూరు చేయవచ్చునా?
సమాధానము:
*ఒక ఉద్యోగి ఏదైనా కేసులో కొన్ని మాసాలు/ కొన్ని సంవత్సరాలు సస్పెన్షన్లో ఉండి తిరిగి ఉద్యోగంలో చేరినచో అతని పై వున్న కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ అతను తిరిగి ఉద్యోగం లో చేరిన తేది నుండి మరియు ఒక సంవత్సరం పూర్తి చేసిన మరుసటి తేదీ నుండి అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం చెల్లించవచ్చును.
ప్రశ్న-5:
*ఒక ఉద్యోగికి పనిష్మెంట్ కింద రెండు వార్షిక ఇంక్రిమెంట్లు వితౌట్ కుమ్యూలేటివ్ పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అట్టి వార్షిక ఇంక్రిమెంట్లు కాలం AAS కింద ఇంక్రిమెంట్ మంజూరు చేయుటకు లెక్కించవచ్చునా?
సమాధానము:
*వార్షిక ఇంక్రిమెంట్ల నిలుపుదల వితౌట్ కుమ్యూలేటివ్ గా పేర్కొనుచూ ఉత్తర్వులు జారీ చేయబడినచో అట్టి కాలం ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద లెక్కించి ఇంక్రిమెంట్ మంజూరు చేయవచ్చును.*