సందేహాలు - సమాధానాలు
FAQ - USAGES OF PENS:
*నేనూ నా మిత్రుడు ఒకే సారి జాబ్ లో జాయిన్ అయ్యాము నేను govt job. తనది ప్రైవేట్ జాబ్. జాయిన్ అయినప్పుడు మా ఇద్దరి salary లు దగ్గర దగ్గర గా ఒకటే కానీ ఇప్పుడు నా మిత్రుడు నా కంటే 50% ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు. ఎందుకు వ్యత్యాసం ఉంటుంది?
సమాధానము:
*ప్రైవేటు జాబ్ కు, ప్రభుత్వ ఉద్యోగానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
*సింపుల్ గా చెప్పాలంటే ప్రైవేట్ జాబ్ స్టాక్ మార్కెట్ లాంటిది. సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చాయి స్థాయికి వెళ్ళవచ్చు. టైమ్ బాగోక పోతే వారి నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకునే స్థితికి రావచ్చు.
*ప్రభుత్వ ఉద్యోగం fixed deposit లాంటిది. స్టాక్ మార్కెట్ లో వచ్చినటువంటి లాభాలు ఎప్పటికీ రావు. కానీ, ఉన్నది పోగొట్టుకోవడం జరగదు.
*ఇక్కడ స్టాక్ మార్కెట్ మంచిదా, fixed deposit మంచిదా అని మనం నిర్ధారించలేము.
*స్టాక్ మార్కెట్ ను అవగాహన చేసుకోగలిగిన వారికి, అందులో పట్టున్న వారు ఎంతైనా సంపద పోగేయగలరు. వారినీ చూసి మనకు అవగాహన లేకుండా ఆవేశ పడితే ఉన్నది పోగొట్టుకోవాలి.
ప్రశ్న:
*సార్, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ లు రెడ్ పెన్ use చేయవచ్చా?
*ప్రొసీడింగ్స్ మీద initial కోసం కానీ, ఆఫీస్ అఫ్ ది స్టాంప్..... మీద received కోసం కానీ సంతకాలు రెడ్ పెన్ తో పెట్టవచ్చా సార్?
సమాధానము:
*సాధారణంగా ఏ కలర్ ఉపయోగించాలని నిర్దిష్టమైన నిబంధనలు ఏమీ లేవు. (గెజిటెడ్ అధికారులు గ్రీన్ కలర్ ఉపయోగించవచ్చు అనే అంశం తో సహా)
*అయితే ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణంగా బ్లూ, బ్లాక్ వాడటం అలాగే గెజిటెడ్ అధికారులు గ్రీన్ పెన్ వాడటం సంప్రదాయం గా వస్తోంది.
*అలాగే ఏదైనా ప్రత్యేకంగా గుర్తు పట్టడానికి కొన్ని సందర్భాల్లో రెడ్ పెన్ వాడటం జరుగుతోంది. ఉదాహరణకు SR లో నెగెటివ్ అంశాలు అంటే సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యలు వంటివి నోట్ చేయడం లాంటివి. లీవ్ అకౌంట్ లో డెబిట్ ఎంట్రీలు ఇలా, కరెక్షన్స్ వంటివి చేయడానికి.
*కేంద్రం అయితే సీనియర్ IAS అధికారులు మినహా మిగిలిన అందరూ బ్లూ, బ్లాక్ INK మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. అందువల్ల చాలా మంది కలెక్టర్లు కూడా గ్రీన్/రెడ్ వాడకుండా బ్లూ, బ్లాక్ ఇంక్ ను మాత్రమే ఉపయోగిస్తున్నారు.
ప్రశ్న: FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా?
జవాబు: FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.