సందేహాలు - సమాధానాలు
FAQ - SUSPENSION*ఒక ఉద్యోగి కొన్ని సందర్భాలలో సస్పెన్షన్ కు గురవుతున్నారు కదా! అటువంటి వారు ఉద్యోగం నుండి తొలగించబడినట్లేనా?
సమాధానము:
*ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయవచ్చు / ఉంచవచ్చు. ఇది ఉద్యోగం కోల్పోవడం లాంటిది కాదు.
*ప్రిలిమినరీ ఎవిడెన్స్ తో సస్పెండ్ చేయవచ్చు, కానీ 6 నెలల్లో ఎంక్వయిరీ కంప్లీట్ చేయాలి, Representation సబ్మిట్ చేయండి, యాక్షన్ లేకపోతే కోర్టులో ఫైల్ చేయండి.
ప్రశ్న: 2
*సస్పెండ్ అయి Reinstate అయిన 3 సంవత్సరాలకు ఇంక్రిమెంట్స్ తీసుకోవచ్చా?
సమాధానము:
*Reinstate అయిన తరువాత ప్రతీ ఏడాది సర్వీస్ కు ఇంక్రిమెంట్ లు ఇవ్వవచ్చు.
ప్రశ్న: 3
*Sir, ఎవరైనా ఉద్యోగి ఒక Criminal case లో ఉంటే, (ఉద్యోగానికి సంబంధం లేని కేసు) అతనిని సస్పెండ్ చేయవచ్చు. కానీ అతనిపై Deptl. Action తీసుకోవాలా? మరి వాటికి CCA రూల్స్ ప్రకారం ఎలా రుజువు చేస్తారు?
సమాధానము:
*Arrest అయి 48 గంటలు రిమాండ్ లో ఉంటే సస్పెండ్ అవుతారు.
*పర్సనల్ కేసు అయితే డిపార్ట్మెంట్ పరంగా చర్యలు ఏమీ ఉండవు.
*కేసు రుజువైతే మాత్రం ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తారు.
*మీరు నిజంగా హత్యాయత్నం/ నేరం చేశారా, అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారా లేదా అనేది డిపార్ట్మెంట్ రుజువు చేయలేదు. ఆరోపణలు రుజువు కాకుండా కేసులు ఉన్నాయని చర్యలు తీసుకోవడం మొదలు పెడితే ఏమవుతుంది? ఎవడి మీద కోపం ఉంటే వాడి మీద కేసులు పెడుతూ పోతారు. అది తోటి ఉద్యోగులు కావచ్చు. అధికారులు కావచ్చు, సబార్డినేట్ ఉద్యోగులు కావచ్చు. ఏదో సందర్భంలో మన మీద కోపం వచ్చిన సాధారణ ప్రజలు కావచ్చు. కుటుంబంలో విభేదాల వల్ల కావచ్చు. వ్యక్తిగత శత్రువుల వల్ల కావచ్చు.
*అనుమానాలతో చర్యలు తీసుకోవడానికి దేశంలో ఎవరికి ఎలాంటి అధికారం లేదు.
*అనుమానాలతో మాత్రమే కాదు, 100% కచ్చితం అని తెలిసినా కూడా ప్రొసీజర్ ప్రకారం రుజువు చేయకుండా ఏమీ చేయడానికి సాధ్యం కాదు.
*బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రింద క్రిమినల్ కేసులలో మాత్రమే కాదు, శాఖాపరమైన కేసులలో అయినా అదే చేయాల్సి ఉంటుంది.
*అభియోగాలను తప్పనిసరిగా రుజువు చేయవలసి ఉంటుంది. క్రిమినల్ నేరాలలో అభియోగాలను శాఖాపరంగా రుజువు చేయడానికి అసలు అవకాశమే లేదు.
*ముందుగా సస్పెండ్ అవుతారు. రెండేళ్ల లోపు కేసు తేలకపోతే తిరిగి నాన్ ఫోకల్ ప్లేస్ లలో విధులలో కి తీసుకుంటారు.
*తన తప్పు లేదని కోర్టులో నిరూపించుకోవాల్సిన బాధ్యత individual పై ఉంటుంది. తప్పు ఉందని కోర్టు నిర్ధారిస్తే డిస్మిస్ అవుతారు.
ప్రశ్న:-ఒక ఉద్యోగిని ఎంత కాలం సస్పెన్షన్ లో ఉంచవచ్చు?
జవాబు:-జీఓ.526 : GAD; తేదీ:19.8.08 ప్రకారం ఒక ఉద్యోగిని 2 సంవత్సరం లకి మించి సస్పెన్షన్ పీరియడ్ లో ఉంచకూడదు.