Sunday, 30 August 2026

Evaluation of Summative Assessment


*🔶SA-I & SA-II పరీక్షలు – External Evaluation విధానం*

    తెలంగాణ పాఠశాల విద్యాశాఖ Summative Assessment-I (SA-I), Summative Assessment-II (SA-II) పరీక్షలకు External Evaluation Systemను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

ఇప్పటివరకు పాఠశాలలోని సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులే తమ విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేవారు. ఇకపై మూల్యాంకనంలో నిష్పాక్షికత, పారదర్శకత, ఏకరూపత, ఖచ్చితత్వం మరియు జవాబుదారీతనం పెంచేందుకు External Evaluation విధానాన్ని అమలు చేయనున్నారు. 

*🍃1. పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు?*

    పరీక్షలు ఇప్పటిలాగే పాఠశాల స్థాయిలోనే జరుగుతాయి.

    పరీక్ష పూర్తయిన అదే రోజు, Headmaster జవాబు పత్రాలను సేకరించి, సురక్షితంగా **Mandal Resource Centre (MRC)**కు సంబంధిత MEOకు అప్పగించాలి.

    ఆ తరువాత MEO Evaluation In-charges మరియు అవసరమైన Evaluatorsను నియమించి మూల్యాంకనం నిర్వహించాలి. మూల్యాంకనం 3 నుంచి 5 రోజులలోపు పూర్తి కావాలి. వీలైనంత వరకు verification మరియు online marks entry కూడా అదే రోజు పూర్తి చేయాలి. 

*🔰2. Headmaster (HM) బాధ్యతలు*⤵️⤵️

    పాఠశాల స్థాయిలో పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ మరియు భద్రతకు Headmaster పూర్తి బాధ్యత వహించాలి.

    నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. 
 
    పరీక్ష క్రమశిక్షణను పాటించాలి.

    పరీక్ష అనంతరం Answer Scripts సేకరించాలి.

    హాజరైన విద్యార్థుల సంఖ్యతో జవాబు పత్రాల సంఖ్యను సరిపోల్చాలి.

    Answer Scriptsను Class-wise, Subject-wiseగా ఏర్పాటు చేయాలి.

    పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్యకు జవాబు పత్రాల సంఖ్య సరిపోతుందో నిర్ధారించాలి.

    Coversను సరిగ్గా seal చేయాలి.

    Coverపై నిర్దేశించిన identification details ఉండాలి.

    Sealed coversను అదే రోజు MRCకు అప్పగించాలి.

*🍃 3. MEO బాధ్యతలు*⤵️⤵️

    **Mandal Educational Officer (MEO)**కు External Evaluationలో ముఖ్యమైన బాధ్యత ఉంటుంది.

    MEO పాఠశాలల నుంచి sealed answer scripts స్వీకరించాలి.

    Covers/packets సంఖ్యను verify చేయాలి.

    School-wise వివరాలను పరిశీలించాలి.

    Answer Scripts అందుకున్నట్లు acknowledgement ఇవ్వాలి.

    Receipt Register నిర్వహించాలి.

    Answer Scriptsను సురక్షితంగా ఉంచాలి.

    Sealed covers తెరవబడకుండా జాగ్రత్త వహించాలి.

    Evaluation In-chargesను నియమించాలి.

    Primary/Upper Primary కోసం ఒకరు

    High School కోసం ఒకరు

    అవసరమైన Evaluatorsను నియమించాలి.

    Evaluation progressను పర్యవేక్షించాలి.

    Marks online entry సమయానికి పూర్తయ్యేలా చూడాలి. 

*✴️ 4. Evaluation Centre ఎలా ఉండాలి?*

    MEO మండల స్థాయిలో Evaluation Centre ఏర్పాటు చేయాలి.

    Evaluation Centreలో authorized personsకు మాత్రమే ప్రవేశం ఉండాలి.

    కేంద్రంలో:  సరిపడా seating,Lighting,Ventilation,Drinking water,Toilets,Answer Scriptsకు secure storage, Evaluatorsకు Tables/Chairs, అవసరమైన stationery , Registers & Forms, వీలైన చోట Internet connectivity, Computer/Data Entry facility, Evaluation సజావుగా జరగడానికి అవసరమైన ఇతర basic facilities ఉండాలి. 

*🍃5. Evaluation In-charge బాధ్యతలు*

Primary & Upper Primary Schools కోసం ఒక Evaluation In-charge, High Schools కోసం మరో Evaluation In-charge నియమించాలి.

*♻️ Evaluation In-charge:*

Sealed Answer Scripts స్వీకరించి receipt records నిర్వహించాలి. Covers openingను supervise చేయాలి. Scriptsను Subject-wise/Class-wiseగా ఏర్పాటు చేయాలి. Answer Scripts భద్రతను నిర్ధారించాలి. మొత్తం ఎన్ని scripts వచ్చాయో లెక్కించాలి. అవసరమైన Evaluators సంఖ్యను నిర్ణయించాలి. మొత్తం evaluation 3–5 రోజుల్లో పూర్తయ్యేలా సరిపడా evaluatorsను ఏర్పాటు చేయాలి. Suitable teachersను evaluatorsగా ఎంపిక చేయాలి. Marking Scheme గురించి evaluatorsకు వివరించాలి. Evaluation qualityను monitor చేయాలి. Question paper/answer keyలో ambiguity ఉంటే సంబంధిత స్థాయికి తెలియజేయాలి. Totalling సరిగ్గా జరిగేలా చూడాలి. Subject-wise Evaluation Completion Report తయారు చేయాలి. Final recordsను MEOకు అప్పగించాలి. 


*✳️ అత్యంత ముఖ్యమైన నిబంధన*

    ఒక Evaluatorకు అతను/ఆమె పనిచేస్తున్న సొంత పాఠశాల విద్యార్థుల Answer Scriptsను evaluation కోసం కేటాయించకూడదు. అంటే తన స్కూల్ పేపర్లు తాను దిద్దకూడదు. 

*🔷6. Evaluators ఎంపిక*

    మండలంలోని అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి Evaluatorsను ఎంపిక చేయాలి.

ఎంపికలో: Subject qualification,Teaching experience,Workload,Availability,నిర్ణీత సమయంలో evaluation పూర్తి చేయగల సామర్థ్యం పరిగణనలోకి తీసుకోవాలి. 

*💥7. Evaluatorsకు Remuneration*

    Answer Script evaluationకు:

    Primary Level: ఒక్క Answer Scriptకు ₹2

    High School Level: ఒక్క Answer Scriptకు ₹3

    చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

    అదనంగా మండల స్థాయిలో Evaluation Camp నిర్వహణ కోసం ఒక్క మండలానికి ₹10,000 lump-sum కేటాయించినట్లు ఉత్తర్వుల్లో ఉంది. 

*🔶8. Online Entry of Marks*

        Evaluation మరియు Verification పూర్తయిన తర్వాత:

    Marksను Subject-wise, Class-wise compile చేయాలి.

    Physical recordsను check చేయాలి.

    నిర్దేశించిన Online Systemలో marks నమోదు చేయాలి.

    వీలైనంత వరకు అదే రోజు Online Entry పూర్తి చేయాలి.

    Physical Award Recordsను సురక్షితంగా ఉంచాలి.

    Physical records మరియు Online records మధ్య తేడా ఉంటే వెంటనే reconcile చేయాలి. 
          
*📌 9. DEO బాధ్యతలు*👇👇

    District Educational Officer:

    District Implementation Plan తయారు చేయాలి.

    Evaluation progressను monitor చేయాలి.

    Mandal-wise completionను review చేయాలి.

    Online marks entry సమయానికి పూర్తయ్యేలా చూడాలి.

    Operational problemsను పరిష్కరించాలి.

    అవసరమైనప్పుడు Evaluation Centresను inspect చేయాలి.

    MEOల నుంచి Compliance Reports తీసుకోవాలి. 
        
*🍃 మొత్తం ప్రక్రియ చాలా సింపుల్‌గా*⤵️⤵️

Schoolలో Exam
→ HM Answer Scripts సేకరణ
→ Class-wise/Subject-wise arrangement
→ Covers Sealing
→ అదే రోజు MRCకు అప్పగించడం
→ MEO స్వీకరణ & భద్రపరచడం
→ Evaluation In-charge + Evaluators నియామకం
→ ఇతర పాఠశాలల Teachersతో Evaluation
→ 3–5 రోజుల్లో Evaluation పూర్తి
→ Verification
→ Marks Compilation
→ Online Marks Entry
→ Records MEOకు
→ DEO Monitoring
      
        ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం Objective, Transparent, Impartial, Uniform, Accurate & Accountable Evaluationను సాధించడం.

Download :