Surrender of Earned Leave
@ Earned Leave 286 రోజులు ఆపై క్రెడిట్ ఉంటే..!
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్జిత సెలవుల (ఈఎల్) సరెండర్ ప్రక్రియపై చాలా మంది ఉద్యోగులకు సరైన అవగాహన లేకపోవడంతో ఆ వెసులుబాటును వినియోగించుకోవడం లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే... మంజూరు చేయాల్సిన అధికారుల్లో కూడా పలువురికి దీనిపై క్లారిటీ లేదు. దీని వలన ఉద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లో నిల్వ ఉన్న సెలవుల బట్టి రెండు వేర్వేరు విధానాల్లో ఈ సరెండర్ సౌకర్యాన్ని కల్పించారు.
1). గ్యాప్ పీరియడ్ తప్పనిసరి: ఒక ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా 15 రోజుల వరకు ఆర్జిత సెలవులను సరెండర్ చేయవచ్చు. అయితే, గత సరెండర్‌కు, ప్రస్తుత సరెండర్‌కు మధ్య ఖచ్చితంగా 12 నెలల వ్యవధి (Gap) ఉండాలి. ఒకవేళ 30 రోజుల వరకు సెలవులను సరెండర్ చేయాలనుకుంటే, గత సరెండర్ నుండి 24 నెలల Gap ఉండాలి.
2). నిల్వ 286 రోజులు వుంటే గ్యాప్ పీరియడ్ అవసరం లేదు: దరఖాస్తు చేసుకునే నాటికి 286 రోజులు లేదా అంతకంటే ఎక్కువ ఆర్జిత సెలవులు నిల్వ ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు Gap నిబంధనల నుండి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. 286 రోజులు ఆపై లీవ్స్ ఉన్న ఉద్యోగ గత సరెండర్‌తో సంబంధం లేకుండా (12 నెలల గ్యాప్ లేకపోయినా) ఆర్ధిక సంవత్సరం మారితే 15 రోజుల వరకు ఈఎల్‌ను సరెండర్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు 2026 ఫిబ్రవరిలో 15 రోజులు సరెండర్ చేసిన టీచర్... ఏప్రిల్ 2026లో కూడా మళ్ళీ 15 రోజులు సరెండర్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్సియల్ ఇయర్ మారింది కాబట్టి. అదే విధంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి సరెండర్ సదుపాయాన్ని వినియోగించుకోకుండా ఉండి, ప్రస్తుతం దరఖాస్తు చేసే నాటికి 286 రోజులు, ఆపై లీవ్స్ నిల్వ ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు 24 నెలల గ్యాప్ నిబంధనతో పనిలేకుండా నేరుగా 30 రోజుల వరకు సెలవులను సరెండర్ చేసుకోవడానికి అర్హులు.
DOWNLOAD :
