Sunday 5 September 2021

TS Academic Calendar 2021-22

 Academic Calendar 2021-22


తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విద్యాక్యాలెండర్ ప్రకారం 2021-22 విద్యాసంవత్సరంలో 213రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించనున్నారు.


♦️పండగ సెలవులు ఇలా..
ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు 12 రోజులపాటు దసరా సెలవులు, 6రోజులు సంక్రాంతి సెలవులు.
@     దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు,
@     సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి.
 అయితే మిషనరీ స్కూళ్లకు మాత్రం డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు

♦️సిలబస్ పూర్తి, పరీక్షల వివరాలు..
* ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్‌ పూర్తి చేయాలి.

* పదోతరగతి విద్యార్థులకు జనవరి 10 నాటికి సిలబస్‌ పూర్తి చేయాలి.

* ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 (ఎఫ్‌ఏ) పరీక్షలకు గడువు: అక్టోబర్ 5

* ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలకు గడువు: జనవరి 31

* డిసెంబరు 1 నుంచి డిసెంబర్ 8 వరకు సమ్మెటివ్-1 పరీక్షలు.

* ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 18 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు.

* ఫిబ్రవరి 28 నాటికి పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు పూర్తి చేయాలి.

* ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి.
Download :