Thursday, 2 July 2026

FAQ - Unauthorized Absence


*సందేహాలు - సమాధానములు*
Unauthorized Absence

ప్రశ్న:
*ఒక ఉద్యోగి గత 3 సంవత్సరాల నుండి విధులకు హాజరుకాలేదు/ ఆచూకీ లేదు. DDO గారు అతనిని ఉద్యోగం నుంచి తొలగించనున్నారు. DDO వేటి ఆధారంగా చూపి తొలగిస్తారు? కుటుంబసభ్యులకు ఎలాంటి లబ్ధి పొందగలరు? దానికి సంబంధిత G.O copy కాని, చట్టపరమైన విధానం ఏమైనా ఉందా.. దయచేసి చెప్పగలరు.

సమాధానము:
    మీరు చెప్పినట్లుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి 3 సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండా, ఆచూకీ కూడా లేకుండా ఉంటే, DDO లేదా నియామక అధికారి నేరుగా తొలగించలేరు.

    ముందుగా AP Civil Services (CCA) Rules, 1991 ప్రకారం క్రమశిక్షణా చర్యలు (disciplinary proceedings) చేపట్టాలి.
    
అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ వ్యక్తి ని సర్వీస్ నుంచి తొలగించడం గనుక చేస్తే అది G.O.Ms.No.260, GA (Ser.C) Dept., Dt.04-09-2003 ప్రకారం చెయ్యాలి. ఇంకా విధులకు అనుమతి లేకుండా (unauthorised absence) నిరంతరంగా 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం గైర్హాజరైతే, CCA Rules ప్రకారం విచారణ జరిపి Removal from Service శిక్ష విధించవచ్చు. అలాగే G.O.Ms.No.11, Finance Dept., Dt.13-01-2004 ద్వారా AP Leave Rules లో కూడా ఇదే నిబంధన చేర్చబడింది. అయితే మీరు ఇక్కడ మిస్సింగ్ పర్సన్ కోసం ఏమిటి చెయ్యాలి అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్న ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ. చివరి తెలిసిన చిరునామాకు నోటీసులు పంపడం. స్పందన లేకపోతే పత్రికలలో/గెజిట్‌లో ప్రచురించడం. Departmental Inquiry నిర్వహించడం. సహజ న్యాయ సూత్రాలు (Natural Justice) పాటించి అవకాశం ఇవ్వడం. అనంతరం Removal/Dismissal ఆదేశాలు జారీ చేయడం. చేస్తే మీకు రూల్ పరంగా కొంత బలం ఉంటుంది, ఇంకా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైనా బెనిఫిట్ ఉంది అంటే ఆ ఉద్యోగి యొక్క స్థితి పై ఆధారపడి ఉంటుంది.

    ఉద్యోగి జీవించి ఉన్నాడని భావించి “Removal from Service” అయితే కుటుంబ పెన్షన్ సాధారణంగా ఉండదు. DCRG, పెన్షన్ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభావితమవుతాయి. Compassionate appointment సాధారణంగా వర్తించదు. ఉద్యోగి చాలాకాలంగా కనిపించకపోతే మీరు చెప్పారు కదా 3 ఇయర్స్ నుంచి కనిపించడం లేదు అని అప్పుడు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ఏమి చెయ్యాలి అంటే

    పోలీస్ మిస్సింగ్ కేసు నమోదు, కోర్టు ద్వారా “civil death” తెచ్చుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్లుగా పోలీస్ మిస్సింగ్ కేసు నమోదు, కోర్టు ద్వారా “civil death” తెచ్చుకుంటే మీకు కుటుంబ పెన్షన్ తదితర ప్రయోజనాల కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీ గా తెలియాలి అంటే నేను go నంబర్స్ టైప్ చేసి ఇస్తున్నాను ఇవి చదివితే మీకు ఇంకా క్లారిటీ గా అర్థం అవుతుంది.

1) G.O.Ms.No.260, GA (Ser.C) Dept., Dt.04-09-2003 – Unauthorized absence exceeding one year → Removal from service.

2) G.O.Ms.No.11, Finance (FR.I) Dept., Dt.13-01-2004 – Leave Rules amendment. AP Civil Services (CCA) Rules, 1991 – Rule 20 (Departmental Inquiry Procedure).